బాబుకు చుక్కలు చూపిస్తున్న లక్ష్మీపార్వతి.. కోర్టు మెట్లెక్కక తప్పదా..?

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ఆమె అత్తగారు నందమూరి లక్ష్మీపార్వతి బాబుకు చుక్కలు చూపిస్తున్నారు. నేను నిప్పు.. అంటూ నిత్యం మాట్లాడే చంద్రబాబు కోర్టు మెట్లెక్కక తప్పని పరిస్థితి తీసుకువచ్చారు. ఆమె కారణంగా ఇప్పుడు తెలుగుదేశం అధినేత ఏసీబీ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి కేసు వేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ చంద్రబాబు హైకోర్టు నుంచి స్టే పొందారు.

ఇప్పుడు ఆ స్టే కాలం తీరిపోయింది. దాదాపు 14 ఏళ్ల కిందటి కేసులో స్టే తొలగిపోవడంతో కేసును విచారణకు స్వీకరించింది. క్రిమినల్‌ కేసుల్లో ఆరు నెలలు దాటి ఉంటే స్టేలు తొలగినట్లేనని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంద్రబాబు ఇప్పుడు కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తంది. చంద్రబాబు గతంలో తెచ్చుకున్న స్టే ఉత్తర్వులకు పొడిగింపు తీసుకోకపోవడంతో విచారణ చేపడుతున్నామని సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.

ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నాళ్లు చంద్రబాబు , ఆయన దళం అంతా జగన్ ను అవినీతిపరుడని.. ప్రతి శనివారం కోర్టు మెట్లెక్కుతారని ఎద్దేవా చేస్తూ వచ్చారు.. ఏ వన్ ఏటూ అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిరావడం ఆ పార్టీ నేతలకూ, స్వయంగా చంద్రబాబు ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చింది.

న్యాయవ్యవస్థను సైతం చంద్రబాబు ప్రభావితం చేయగలరని గతంలో చాలామంది న్యాయవాదులు సైతం ఆరోపించారు. ఆయన ప్రతి కేసులోనూ స్టేలు తెచ్చుకుంటారని.. స్టే తెచ్చుకోకపోయినా సరే.. కోర్టుల్లో చంద్రబాబుకు ఎదురు ఉండదని ఆయన అంతగా ప్రభావితం చేయగలరని గతంలో చాలా విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందన్నది ఉత్కంఠభరితంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version