మాజీ సిఎంకి కరోనా…?

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని ఎక్కడా తగ్గడం లేదు. దీనికి సంబంధించి మందు కనుక్కోవడం కూడా ఇప్పట్లో సాధ్యం కాదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఎవరి నుంచి వస్తుందో ఎలా వస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు.

రాష్ట్రపతి భవన్ లో, గవర్నర్ ఉండే రాజ్ భవన్ లో కరోనా వైరస్ అడుగు పెట్టింది. దీనితో చాలా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మాజీ సిఎం కూడా కరోనా వైరస్ బారిన పడినట్టు సమాచారం. బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ కరోనా బారిన పడినట్టు సమాచారం. దాణా కుంభకోణంలో లాలు ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు జైల్లో ఉండగా అనారోగ్యం వచ్చింది.

రాంచిలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న లాలూకు ఉమేష్ ప్రసాద్ అనే వైద్యుడు చికిత్స చేస్తున్నారు. ఆయన వైద్యం అందిస్తున్న మరో రోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో లాలూ ఇప్పుడు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకు వయోభారం సమస్యలు ఉండటం తో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version