విజయవాడలో కొండ ప్రాంత వాసుల్లో టెన్షన్ నెలకొంది. భారీ నుంచి అతి భారీలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగి పడి వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ కొండ ప్రాంతం నివాసాలపై కొండచరియలు విరిగి పడ్డాయి.
దీంతో ఇల్లంతా ధ్వంసం కాగా మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని భవానిపురం పోలీసులు తక్షణమే స్పందించి మట్టిని తొలగించి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించారు, అయినా ఫలితం దక్కలేదు. ఇక మరో పక్క ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడగానే ఘాట్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు. హుటాహుటిన సహాయక బృందాలను రంగంలోకి దింపి… రాళ్లను తొలగించే పనులు చేపట్టారు.