ఆన్లైన్ క్లాసులు.. కోతులు ఎంత శ్రద్ధగా వింటున్నాయో..!?

-

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని అవి నెటిజన్లను ఆకర్షిస్తూ అంతట పారిపోతున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆన్లైన్ క్లాసులను చిన్నారు లే కాదు కోతులు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నాయి అని తెలిపే ఒక ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

ఈ ఫోటోలో విద్యార్థి యూనిఫాం వేసుకుని ఐడి కార్డ్ వేసుకొని సెల్ఫోన్లో ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. అదే సమయంలో ఆ చిన్నారి వెనుక ఉన్న కిటికీ దగ్గరికి మూడు కోతులు వచ్చి కూర్చున్నాయి. ఇక కోతులు అంటే కోతి పనులు చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న కోతులు మాత్రం ఎంతో మంచి కోతులు ఉన్నాయి. కిటికీ దగ్గర కూర్చుని ఎంతో శ్రద్ధగా ఆన్లైన్ క్లాసులు వింటున్నాయి. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version