నిన్ లో ఉద్యోగ అవకాశాలు..డిగ్రీ అర్హత తో నెలకు 65 వేల జీతం..

-

ప్రభుత్వ శాఖలో పని చేయాలని భావించే వారికి శుభవార్త..భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-బి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ ను విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు హైదరాబాద్ లోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యొగాలకు సంభందించిన వివరాలు, ఖాలీలు పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-బి, ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయస్సు: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.20,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, బీకాం, ఎంపీహెచ్‌, పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ హాల్‌ అండ్‌ కమిటీ రూం, ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌), హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 10, 2022.

ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version