సహజంగా వేసవికాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వలన మొక్కల పై కూడా ప్రభావం పడుతుంది. చాలా శాతం మంది ఇంట్లో ఎంతో ఇష్టంగా మొక్కలను పెంచుతూ ఉంటారు. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉండడం వలన వేడిగా గాలులు వస్తూ ఉంటాయి. దాంతో మొక్కలు వాడిపోతాయి. ఎప్పుడైతే సూర్యకాంతి ఎక్కువగా ఉంటుందో ఆకులు రాలిపోవడం, మొక్క ఎండిపోవడం వంటివి జరుగుతాయి. ఈ విధంగా కొన్ని రోజులు కొనసాగడం వలన మొక్కలు ప్రాణాలను కూడా కోల్పోతాయి. కనుక వేసవికాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.
ఇలా చేస్తే సంవత్సరం అంతా మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. చాలా మంది మొక్కలలో మట్టిని మార్చుతూ ఉండరు. ముఖ్యంగా వేసవికాలం మొదలు అవ్వకుండానే మొక్కలలో మట్టిని మార్చాలి. ఇలా కొత్త మట్టిలో నాటడం వలన మొక్కల ఎదుగుదల బాగుంటుంది. కేవలం మట్టి మాత్రమే కాకుండా కొత్త ఎరువులను కూడా ఉపయోగించి మొక్కలను మార్చండి. ఇలా చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మీరు వేసవికాలంలో మొక్కలను పెంచాలి అని అనుకుంటే మీ బాల్కనీ లేక గార్డెన్ లో వేడిని తట్టుకునే మొక్కలను మాత్రమే పెంచండి. కలబంద, పామ్ చెట్టు, మల్లెపూలు వంటి మొదలైన మొక్కలను నాటడం వలన ఉష్ణోగ్రతలు పెరిగినా సరే ఎంతో ఆకుపచ్చగా ఉంటాయి.
సహజంగా ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో మొక్కలకు నీళ్లు ఎక్కువగా పోయాలని చాలామంది భావిస్తారు మరియు నీరు పోయడం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి అనే చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కలలో మట్టి ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మొక్కలలో ఉండేటువంటి మట్టి ఎండిపోతుందో తప్పకుండా నీరుని పొయ్యాలి. ఇలా చేస్తే మొక్కలు ఎదుగుతాయి. కాకపోతే అవసరానికి మించిన నీరును మొక్కలకు పోస్తే కుళ్ళిపోతాయి. కనుక తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. సహజంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మొక్కల పై గుడ్డలను కప్పి ఉంచుతారు. అయితే సాయంత్రం సమయంలో చల్లగాలి ఉన్నప్పుడు మొక్కపై కప్పిన గుడ్డను తీసేయొచ్చు. ఇలా చేయడం వలన మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి.