భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రెండ్రోజుల కిందట సూపర్ బజార్ సెంటర్‌లో కూలిన ఐదంతస్తుల భవనం కింద పడి చనిపోయిన ఇద్దరు కూలీలకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
అప్పటివరకు వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం రూమ్ ముందు గేటు వేసి మృతుల బంధువులు, వివిధ సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.