మూడో ప్రపంచ యుద్ధం మీద సరికొత్త వార్త బయటకొచ్చింది !

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎవరైనా కావాలని పుట్టించారా? అన్న దాని విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎలా పుట్టిందో తెలియదు ఈ సూక్ష్మ జీవి ప్రస్తుతం భూమి మీద ఉన్న మనిషిని దానికి గురిచేస్తూ రక్తం ఒలికించ కుండానే చాలా దేశాలను గజగజలాడిస్తుంది. మొత్తంమీద కరోనా వైరస్ భయం అంటే ఏంటో ప్రస్తుతం ఉన్న సమాజానికి చిన్న ఇంట్రడక్షన్ పార్టీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఆర్థిక రంగం కుదేలు అయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా ఉద్యోగాలు కూడా చాలామంది కోల్పోయే పరిస్థితి రానుందని, తినటానికి తిండి దొరికే రోజులు ఉంటాయో లేదో చెప్పలేని పరిస్థితి ముందు ముందు దాపురించిందని ప్రపంచ స్థాయిలో వార్తలు వినపడుతున్నాయి.

 

ప్రస్తుతం ఇటలీ దేశంలో మానవ జీవన విధానం పూర్తిగా తలక్రిందులు అయిందని అక్కడ పరిస్థితులు బట్టి చూస్తుంటే మనుషుల బ్రతకడం కంటే చావడం చాలా బెటర్ అనిపిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద భూమి మీద కరోనా వైరస్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వాతావరణం కనబడుతోందన్న సరికొత్త వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version