మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు ఏపీ పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని గతంలో సీఎం జగనే చెప్పారని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. దోషులు ఎవరైనా సరే బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
మరోవైపు ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం హైదరాబాద్ కి తరలించిన సిబిఐ అధికారులు.. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరు పరిచారు. అనంతరం భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనని సిబిఐ అధికారులు చంచల్గూడా జైలుకి తరలించారు.