ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ కొత్తగా డబ్ల్యూ11, డబ్ల్యూ31, డబ్ల్యూ31 ప్లస్ పేరిట మూడు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. ఇక డబ్ల్యూ31, డబ్ల్యూ31 ప్లస్ ఫోన్లలో వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, దానికి తోడు మరో 5 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. ఇక ఎల్‌జీ డబ్ల్యూ11 ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డబ్ల్యూ 31 ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లలో 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది.
ఎల్‌జీ డబ్ల్యూ 11 స్పెసిఫికేషన్స్…
* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎల్‌జీ డబ్ల్యూ31, డబ్ల్యూ31 ప్లస్ స్పెసిఫికేషన్స్…
* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,
* 128 జీబీ స్టోరేజ్ (డబ్ల్యూ31 ప్లస్), 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 13, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, గూగుల్ అసిస్టెంట్ బటన్
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎల్‌జీ డబ్ల్యూ 11, డబ్ల్యూ31, డబ్ల్యూ31 ప్లస్ ఫోన్లు మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో విడుదల కాగా.. ఈ ఫోన్లు వరుసగా రూ.9,490, రూ.10,990, రూ.11,990 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి.