భోజనం తర్వాత ఇలా చేస్తున్నారా..? అస్సలు చెయ్యొద్దు

-

కొన్ని అలవాట్లు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. భోజనం చేసిన తరువాత నడవటం, పండ్లు తినడం చేస్తుంటారు. నిజానికి ఇవి మంచి అలవాట్లే కానీ ఎప్పుడు చేయాలి ఎలా చేయోలి అనేది ముఖ్యం.  మంచి పోషకాహారం తీసుకుంటున్నాం క‌దా అని ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం! అంటే భోజ‌నం చేశాక మ‌నం చేయకూడని ప‌నులు అన్న‌మాట‌. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే. ఈ క్ర‌మంలోనే భోజ‌నం చేశాక మ‌నం చేసే కొన్ని పొర‌పాట్లు ఏమిటో వాటి వ‌ల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ, ఆబగా పండ్లు తినకూడదు. పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.

2. భోజ‌నం చేసిన వెంటనే టీ తాగితే భోజనం జీర్ణమవదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.

3. తినగానే స్నానం చేయవద్దు. కాళ్లు, చేతుల్లోకి ర క్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

4. భోజనం చేసి పదడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెపుతుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించటంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి.

5. తినగానే వెంటనే పక్కమీద కు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version