విద్యార్థులకు ఎల్‌ఐసీ గుడ్ న్యూస్..విద్యాధన్ స్కాలర్‌షిప్..వివరాలు..

-

ప్రముఖ భీమా సంస్థ ఎల్ఐసీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ విద్యాధన్ స్కాలర్‌షిప్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది..ఇది విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

ఇందుకు అర్హతలు:

విద్యాధన్ స్కాలర్‌షిప్ ఇంటర్‌ ఫస్టియర్‌ , డిగ్రీ ఫస్టియర్‌ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థులకు అందిస్తారు. అభ్యర్థులు ముందు తరగతిలో కచ్చితంగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,60,000 మించకుండా ఉండాలి..

ఎంత స్కాలర్‌షిప్‌ వస్తుంది..

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున మూడేళ్లు అందజేస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఇంటర్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 30 దరఖాస్తులకు చివరితేది.అర్హత కలిగిన వారు ఎల్‌ఐసీ అధికార వెబ్ సైట్ లో అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version