మీరు ఎల్ఐసి పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే నిజంగా మీకు శుభవార్త. ఇప్పుడు మీకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ఎల్ ఐ సి ద్వారా ప్రవేశ పెడుతున్నారు. అయితే నిజంగా ఎల్ఐసి పాలసీ వల్ల మంచి బెనిఫిట్ ఉందనే చెప్పాలి. దీంతో ప్రతి నెల చేతికి డబ్బులు కూడా వస్తాయి. ఏ మాత్రము రిస్కు లేకుండా సులువుగా మీ చేతికి డబ్బు వస్తుంది. దేశీయ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది.
అయితే వివిధ రకాల పాలసీలతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఆఫర్లు కూడా ఇస్తోంది. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా ఒక పథకాన్ని అమలు చేయబోతోంది. దీనిలో ప్రయోజనాలు ఎన్నో. 60 ఏళ్లు దాటిన వారు ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మీ పెన్షన్ మీకు అందుతుంది. అయితే ఈ పథకం 2023 మార్చి వరకు మాత్రమే అందుబాటు లో ఉంటుంది. కేవలం సీనియర్ సిటిజన్ మాత్రమే దీనిలోకి చేరడానికి అవుతుంది.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి పదేళ్లు. అయితే పదేళ్ల వరకు పథకం ప్రయోజనాలు పొందవచ్చు. వయ వందన యోజన స్కీమ్ ద్వారా మీకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది ఈ పథకంలో ఇప్పటి దాకా 6. 28 లక్షల మంది చేరారు. నెలకు వెయ్యి నుంచి రూ.9250 వరకు పెంచుకునే అవకాశం లభిస్తుంది. మూడు నెలలకి, ఆరు నెలలకి చొప్పున పెన్షన్ పొందవచ్చు. దీనిలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 9250 పెన్షన్ వస్తుంది ఇలా చేసే ఇన్వెస్ట్మెంట్ బట్టి మీ పెన్షన్ లభిస్తుంది.