వాటే పాలసీ… 3 నెలలకు ఒకసారి పదివేల రూపాయలు…!

-

ప్రభుత్వ రంగానికి చెందిన దేశీ అతిపెద్ద బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. వీటి వలన అనేక లాభాలు ఉంటాయి. పైగా మంచిగా డబ్బులు కూడా వస్తాయి.

వీటిల్లో మనీ బ్యాక్, పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఈ పాలసీలు తీసుకోవడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా మీరు ఆదాయం పొందొచ్చు. ఎల్‌ఐసీ జీవన్ శాంతి అనేది కూడా ఒకటి. ఇది నాన్ లింక్డ్ స్కీమ్.

దీని వలన ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఒకేసారి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. పెన్షన్ ఎప్పుడు తీసుకున్న పరవాలేదు. ఇక దీనిలో డబ్బులు ఎలా వస్తాయ్ అనేది చూస్తే…

మీరు ఒకేసారి రూ.5 లక్షలు కడితే మూడు నెలలకు ఒకసారి రూ.10 వేలు వస్తూనే ఉంటుంది. మీరు జీవించి ఉన్నంత కాలం మీకు పెన్షన్ వస్తుంటుంది. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తం వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version