ఈరోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.. ఇటీవల కరోనా మిగల్చిన పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..అందులో ఎల్ఐసి పాలసీలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. ఎల్ఐసి మనదేశంలోనే అతి పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ..తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఎల్ఐసీ అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పథకాలను రూపొందిస్తుంది..
ఎల్ఐసి అందిస్తున్న పథకాలలో ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఇది ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీతో పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందుతారు.. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పాలసీలో ఇన్సూరెన్స్‌తో పాటే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రోజుకు రూ. 256 లెక్కన నెలకు రూ. 7,960 చొప్పున కడితే.. మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ.54 లక్షలు అందుతాయి…ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఆ మొత్తం నామీనికి వెళ్తుంది.. ఇక ఈ పాలసీలో చేరాలంటే కనీస వయసు 18 ఉంటే సరిపోతుంది. 59 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో వేర్వేరు మొత్తాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా కూడా పాలసీని తీసుకోవచ్చు..ఇందులో టర్మ్ పాలసీలను కూడా తీసుకోవచ్చు..
ఇకపోతే మొత్తం 25 సంవత్సరాల వ్యవధిలో ఇన్వెస్టర్ రూ.14,67,118 వరకు కట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి దీనిని 3 రెట్లకు పైనే అంటే రూ.54 లక్షల వరకు వస్తుంది..వీటితో పాటు 10, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఇలా వేర్వేరు టెన్యూర్స్ కూడా ఉంటాయి.. ఒకవేళ ఇవి ఉండగానే వ్యక్తి మరణిస్తే మొత్తం డబ్బులు నామీనికి ఇస్తారు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..