పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవన్ ప్రమాణ్ పత్ర అని కూడా అంటారు. పెన్షన్ ని పొందాలంటే సరైన సమయానికి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనే లేదు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ని ఆన్ లైన్ ద్వారా సబ్మిట్ చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. పెన్షనర్లు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, సెక్యూర్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్ చేయవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు.
జీవన్ ప్రమాణ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్ కోసం ఎంటర్ చేసుకోవచ్చు.
జీవన్ ప్రమాణ్ సెంటర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పేరు వంటి డీటెయిల్స్ ని ఇవ్వాలి.
ఆధార్ అథెంటికేషన్ కూడా తప్పనిసరి.
ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ అయిన బయోమెట్రిక్‌లను ఇవ్వాల్సి వుంది.
జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ID మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.
ఈ సర్టిఫికేట్ IDలు పెన్షనర్, పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ కోసం లైఫ్ సర్టిఫికేట్ రిపోజిటరీలో ఉంటాయి.
ఎప్పుడైనా మీరు వీటిని పొందొచ్చు.
సర్టిఫికేట్ PDF కాపీని జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చెయ్యచ్చు.