డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మణి. మొత్తం ఐదు భాగాలున్న ఈ నవలను రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సెప్టెంబర్ 30న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.460 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే తాజాగా రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్ డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
పొన్నియన్ సెల్వన్ పార్టు-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చియాన్ విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది.