ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా .. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం లైగర్. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ రెచ్చిపోయి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా సుమారుగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో నష్టాలను మిగిల్చింది. అటు నిర్మాతలుగా పూరీ, ఛార్మీ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా పూర్తిగా నష్టపోయారని వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
లైగర్ : మైక్ టైసన్ పారితోషకం అన్ని కోట్లా..?
-