వేణుగోపాల స్వామి ఆలయం మీద పిడుగు..ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో!

-

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలు సైతం అయ్యాయి.వారికి చికిత్స అందిస్తుండగా.. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం అందజేసింది. ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలాఉండగా, ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు పడింది. ఆలయంలో రావి చెట్టును పక్కనే ఉన్న గుడి మీద పిడుగు పడటంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈదురుగాలులు కూడా వీస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. కాగా, తిరుమల లడ్డు అపవిత్రం నుంచి నేడు సింహాచలం వరకు.. రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఏపీలోనే జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news