Lijomol Jose: ఓటీటీలో రచ్చనీయంగా మారిన చిత్రం ‘జై భీమ్”. మూవీ లవర్స్ అమితంగా ఆకట్టుకున్న చిత్రం. అసలు ఈ సినిమాలో ఏం స్పెషల్ ఉంది అనుకునే వారికి సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. స్వాతంత్రం వచ్చి.. 75 యేండ్లు గడిచినా.. ఉండటానికి నిలువడానికి నీడ లేక.. ఆలోచనలతో సతమవుతున్న ఏన్నో బతుకులున్నాయి. ఈ స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ చదువు, న్యాయానికి అమడ దూరంలో ఉన్న బతుకులెన్నో ఉన్నాయి.
ధర్మం, న్యాయంగానే ఉండాలని ఆశించేవాళ్ల సామూహిక స్వప్నం. ధర్మానికి, న్యాయానికి, చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపించిన చిత్రం. సమాజాన్ని కొడవల్లా ప్రశ్నించే చిత్రం జై భీమ్. ఈ చిత్రం కోసం.. హీరోసూర్య.. తన ఇమేజ్ సైతం పక్కన పెట్టి ప్రాణాన్ని పోశాడు. సినిమా చూసిన వారందరూ సూర్యను ఎంతగా ప్రశంసిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో కీలక పాత్ర చిన్న తల్లి..ఈ పాత్రను పోషించిన లిజోమోల్ జోస్‌ను కూడా అంతే పొగుడుతున్నారు.
ఈ చిత్రంలో నటి లిజోమోల్ జోస్ నిండు గర్భిణి కనిపించింది.తన భర్త కోసం వెతుకులాట, అన్యాయంగా తన భర్తను పోలీసులు అరెస్ట్ చేసినా.. నిస్సహాయ స్థితి కనిపించే పాత్రే చిన్నతల్లి. అలాంటి ఒక బరువైన పాత్రను అంతకంటే.. న్యాచురల్ గా తన నటనతో మెప్పించింది. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది లిజోమోల్ జోస్. ఈ చిత్రంలో ఆమె ఏడ్చిన ఏ సీన్లో కూడా లిజోమోల్ జోస్ గ్లిసరిన్ను ఉపయోగించలేదట. కొన్ని సీన్లు చేస్తున్నప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పుకొచ్చింది లిజోమోల్ జోస్.
లిజోమోల్ జోస్‌కు ఇదేమీ ఫస్ట్ మూవీ కాదు. ఇప్పటికే పలు మలయాళ సినిమాలతో నటించి మెప్పించింది. మాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలో జై భీమ్ చిత్రం ఆమె కేరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో తనకు ఆఫర్లు వస్తున్నాయి. బిజీ హీరోయిన్గా మారిపోనుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
లిజోమోల్ జోస్ నటన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.