ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ హడావిడి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతకముందు వరకు అంతా చినబాబుదే పెత్తనం అన్నట్లు పరిస్తితి ఉండేది. అలాగే చినబాబు సైతం బాగా హడావిడిగా తిరిగేవారు. కొన్ని నెలల క్రితం గుంటూరులో రమ్యశ్రీ హత్య ఘటన సమయంలో లోకేష్ బాగా హైలైట్ అయ్యారు. అప్పటినుంచి లోకేష్ దూకుడుగా కనిపించడం లేదు.
అందుకనే లోకేష్‌ని పూర్తిగా సైడ్ చేసి చంద్రబాబు ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. మళ్ళీ లోకేష్ తెరవెనుక ఉండే కథ నడుపుతారని తెలుస్తోంది. చంద్రబాబే తమ సీఎం అభ్యర్ధి అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు..ఇంకా దూకుడుగా ఉంటున్నారు. ఇటీవల పార్టీ ఆఫీసులపై జరిగిన దాడులకు నిరసనగా లోకేష్ దీక్ష చేయొచ్చు…కానీ చంద్రబాబే ముందుండి కార్యక్రమం నడిపించారు. ఆయనే దీక్షకు దిగారు…అలాగే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫుల్ ఎటాక్ చేస్తున్నారు.
అంటే లోకేష్‌ని సైడ్ చేసి చంద్రబాబే పార్టీని తీసుకెళ్లనున్నారు. అనవరసంగా ఇప్పుడు లోకేష్ హైలైట్ అయితే పార్టీకే డ్యామేజ్ జరుగుతుందని అర్ధమైపోతుంది. అందుకే ప్రస్తుతం టీడీపీలో లోకేష్ హడావిడి తగ్గింది…మొత్తానికి చంద్రబాబు వ్యూహాత్మకంగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.