సైఫ్ అలీఖాన్ అభిమానులకు బిగ్ రిలీఫ్. సైఫ్ అలీఖాన్ హెల్త్ పై కెళ్ళాక ప్రకటన చేశారు వైద్యులు. సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం తప్పిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు లీలావతి వైద్యులు.. ఆస్పత్రిలోనే సైఫ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసారూ పోలీసులు.
సైఫ్ ఇంట్లో క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్స్ ఆధారాలు సేకరణ చేశారు. సైఫ్ ఇంటిలోని ముగ్గురు పనివాళ్ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన మీద జూ.ఎన్టీఆర్ రియాక్షన్ ఇచ్చారు. ఈ ఘటన తెలియగాని షాక్ అయ్యానని ‘X’ లో తారక్ పోస్ట్ పెట్టారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన జూ.ఎన్టీఆర్… ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో సైఫ్ ఆలీఖాన్ కు కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి. బాంద్రాలో తన ఇంట్లో చోరీకి యత్నించాడు దుండగుడు..అయితే అడ్డుకున్న పనిమనిషికి తీవ్ర గాయాలు అయ్యాయి. గొడవ జరుగుతుండగా వచ్చిన సైఫ్ ను కత్తితో పొడిచాడు దుండగుడు.