ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారా..? గూగుల్‌ పే, ఫోన్‌ పే, ఇతర UPI ట్రాన్సాక్షన్‌లపై లిమిట్‌… చూసుకోండి..!

-

ఈ మధ్య ప్రతీ ఒకరు కూడా క్యాష్ పేమెంట్స్ చెయ్యకుండా ఆన్ లైన్ పేమెంట్స్ ని మాత్రమే చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు మన ఇండియాలో యూపీఐ పేమెంట్స్‌ ఎక్కువైపోయాయి. చిన్న వస్తువు నుండి పెద్ద వాటి దాకా యూపీఐ పేమెంట్స్ చేసే కొంటున్నారు. ఇప్పటి వరకు అయితే పేమెంట్స్ చెయ్యడానికి ఎలాంటి లిమిట్ కూడా లేదు.

రోజు లో ఎన్ని యూపీఐ పేమెంట్‌ ట్రాన్సాక్షన్‌లు ని అయినా సరే చేస్తున్నారు. కేవలం మనం పంపే అమౌంట్ మీద మాత్రమే లిమిట్ అనేది వుంది. కానీ త్వరలో గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం మరియు ఇతర UPI పేమెంట్స్‌ యాప్‌స్ ట్రాన్సాక్షన్‌స్ మీద లిమిట్ ని పెట్టే అవకాశం ఉంది. ఇక నుండి పేమెంట్ చేసే వారు నచ్చినన్ని ట్రాన్సక్షన్స్ ని చేసే అవకాశం ఉండదని అంటున్నారు.

UPI పేమెంట్స్‌ యాప్‌ల ద్వారా అన్‌లిమిటెడ్‌ ట్రాన్సాక్షన్‌లు ని ఇక మీదట చేయలేకపోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI డిజిటల్ పైప్‌లైన్‌ను నడిపిస్తుంది. అయితే యూపీఐ పేమెంట్స్‌ వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేయడానికి NPCI చూస్తోందిట. ఇందు మేరకు రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. వాల్యూమ్ క్యాప్ ఇప్పుడైతే లేదు 2022 నవంబర్‌లో కాన్సెన్‌ట్రేషన్‌ రిస్క్‌ ఉండకూడదని NPCI థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) కోసం 30 శాతం వాల్యూమ్ క్యాప్‌ను ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడైతే NPCI అన్ని విషయాలను చూస్తోంది. డిసెంబర్ 31 గడువును పొడిగించడంపై తుది నిర్ణయం తీసుకోలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version