మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్ జారీ…డిసెంబర్‌ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం

-

మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్ ను ఆయా జిల్లా ల ఎక్సయిజ్ అధికారులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం…. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా… 2 వేల 620 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. గతం కంటే నాలుగు వందల నాలుగు మద్యం షాప్స్ ఈ ఏడాది పెరిగనున్నాయి.

తాజాగా టెండర్ దాఖలు కు అర్హత లు, ప్రాసెస్ పై మార్గ దర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఆబ్కారీ శాఖ. మద్యం షాపుల దరఖాస్తులను నేటి నుండి 18 వరకు స్వీకరించనున్నారు అధికారులు. ఒక్కో ధరఖాస్తు ఫీజు 2 లక్షలు గా ఫిక్స్‌ చేసింది సర్కార్‌. ఈ నెల 20 న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపులు జరుపనున్నారు. డిసెంబర్ ఒకటి నుండి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నారు. కాగా.. ఈ సారి నాలుగు వందలకు పైగా మద్యం షాపులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగానే ఖాజనా రానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version