List of Central Government Schemes 2023: కేంద్రం అందిస్తున్న ఈ పథకాల పూర్తి వివరాలు మీకోసం..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. చాలా మంది ఈ స్కీముల ప్రయోజనాన్ని పొందుతున్నారు. మరి కేంద్రం అందిస్తున్న ఆ స్కీమ్స్ గురించి.. వాటి పూర్తి వివరాలని ఇప్పుడే చూద్దాం.

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన:

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది. బ్యాంక్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్స్ వంటివి ఇస్తుంది. దీన్ని మోడీ 28 ఆగస్టు 2014న ప్రారంభించారు. 15 ఆగస్టు 2014న ఈ స్కీమ్ గురించి మాట్లాడారు మోడీ. జీరో బ్యాలెన్స్ అకౌంట్లతోనే రూ.2 లక్షల ప్రమాద బీమా ని పొందవచ్చు. జన్ ధన్ యోజన స్కీము వచ్చిన తర్వాత కోట్లాది మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యమయ్యారు.

జన్ ధన్ ఖాతాల ప్రయోజనం:

డిపాజిట్లపై వడ్డీ వస్తుంది.
పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రొడక్టుల యాక్సస్.
దీని ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ.10 వేలుగా ఉంది.
రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా.
దేశవ్యాప్తంగా ఈజీ మనీ ట్రాన్స్‌ఫర్.

PM గతిశక్తి:

ప్రధాని మోదీ అక్టోబర్ 2021లో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బహుళ-మోడల్ కనెక్టివిటీ కోసమే దీన్ని తీసుకు వచ్చారు. ఈ పథకం విలువ రూ. 100 లక్షల కోట్లు.

ఆయుష్మాన్ భారత్ CAPF :

ఇది ఆరోగ్య సంరక్షణ పథకం. దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది కోసం దీన్ని తీసుకొచ్చారు. 23 జనవరి 2021న దీన్ని స్టార్ట్ చేసారు.

గ్రామ ఉజాల పథకం:

23 మార్చ్ 2021న వారణాసిలో గ్రామ ఉజాల పథకాన్ని తీసుకు వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎల్‌ఈడీ బల్బులను ఇస్తోంది ప్రభుత్వం.

రైల్ కౌశల్ వికాస్ యోజన:

రైల్వే మంత్రి 17 సెప్టెంబర్  2021న న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. మూడేళ్లపాటు 50,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా పరిశ్రమకి సంబందించిన స్కిల్స్ యువత కి ఇస్తున్నారు. వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ ట్రేడ్‌లలో 1000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version