Live Video : ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పైలట్‌ సహా చిన్నారికి గాయాలు

-

ఝార్ఖండ్‌లో ఓ విమానం ఉన్నట్టుండి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం అదుపు తప్పడం వల్ల ధన్ బాద్ నగరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

ఓ చిన్నసైజు విమానం గురువారం మధ్యాహ్నం నగరంలోని బర్వాడ్డ ఏరోడోమ్ నుంచి బయలుదేరింది. ఆకాశంలో కొంత సమయం విహరించాక విమానం అదుపుతప్పింది. నేరుగా ఎయిర్​పోర్టుకు ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. విమాన కూలిన శబ్దం విన్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్, మరో చిన్నారిని గ్రామస్థుల సాయంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో ప్రమాదం జరిగిన స్థలంలో ప్రజలు భారీగా గుమిగుడడం వల్ల వారిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version