సాధారణంగా మన ఇళ్లల్లో బల్లులు ఉంటూనే ఉంటాయి. బల్లి మీద పాడడం పాపం పంచాంగాలు తిరగేయడం లేదా పండితులని అడగడం చేస్తూ ఉంటాం. పంచాంగం లో కానీ లేదంటే ఏదైనా పుస్తకం లో కానీ అక్కడ ఏమి వ్రాసి ఉందొ దాన్ని వెంటనే ఆచరిస్తారు. ముందు వెనుక కూడా చూడరు. పైగా ఎవరు ఏమి చెప్పినా కూడా ఎంతో గుడ్డిగా పాటిస్తూ ఉంటారు. లేదా కంచి వెళ్లి వస్తే ఏ దోషం అయితే నిజంగా మన మీద బల్లి పడితే ఏం అవుతుంది..?, దీని వలన మనకి ఏదైనా నష్టం కలుగుతుందా…? వంటి విషయాలని చూద్దాం.
కొన్ని బల్లులు విషపూరితమైనవి. దాదాపు 6000 పై చిలుకు బల్లి రకాలలో, యేవో కొన్ని మాత్రమే విషపూరితం అయినవి. అది కూడా కొంత వరకే. పైగా సాధారణంగా మన ఇళ్లల్లో తిరుగుతూ, దీపాల దగ్గర, ఇతర ప్రదేశాలలో సంచరించే పురుగుల్ని తినే బల్లులు, విషపూరితమైనవి కావు.
ఒక్కో సారి శరీరం లో జరిగే మార్పుల వలన వాటి పట్టుని కోల్పోతాయి. అప్పుడు అవి మన మీద పడతాయి. దానికే మనం చేదు జరుగుతుందని అనుకోవడం మంచిది కాదు. ఏది ఏమైనా నమ్మకం మంచిదే… కానీ మూఢ నమ్మకమే ప్రమాదం అని తెలుసుకోవాలి.