బిగ్ బ్రేకింగ్ : బాబ్రీ కేసులో అద్వానీని ప్రశ్నించిన సీబీఐ కోర్టు..!

-

1992 బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసుకు సంబంధించి సీబీఐ స్పెష‌ల్ కోర్టు ఇవాళ బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీ వాంగ్మూలాన్ని న‌మోదు చేసింది. నాలుగున్నర గంటల పాటు జరిగిన విచారణలో అద్వానీని కోర్టు 100కి పైగా ప్రశ్నలను అడిగింది. అయితే తనపై ఉన్న అన్ని ఆరోపణలను అద్వానీ ఖండించారని అతని న్యాయవాది వెల్లడించారు. అయితే ఈ కేసు విచార‌ణ‌ను ఆగ‌స్టు 31లోగా పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు సూచించింది.

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న తరుణంలో అద్వానీని సీబీఐ కోర్టు విచారణ జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వీరిద్దరు సుమారు 30 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఈ కేసులో ఆరోపణలున్న బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని కూడా సీబీఐ ప్రత్యేక  కోర్టు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version