లాక్ డౌన్ లో కొడుకు పుట్టిన రోజు చేసాడు… పోలీసులు ఏం చేసారంటే…!

-

కరోనా నుండి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. డాక్టర్లు, పోలీసులు, వారి వారి విధినిర్వహణలో వారి కుటుంబాలను విడిచి ప్రజలకు రక్షణ కల్పించడానికి కృషి చేస్తున్నారు. కానీ కొందరు సామాజిక భాద్యతలేని వారు మాత్రం ఇవేం తమకు పట్టన్నటు ప్రవర్తిస్తున్నారు. కరోనా ను అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ను పాటిస్తుంటే వీరు మాత్రం మా సరదాలు, పార్టీలే మాకు ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి యూపీ లోని గోరఖ్‌పూర్‌లోని బేటియహాటా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కనపెట్టి తన పదేళ్ల కుమారుడి పుట్టిన రోజు వేడుక ను ఘనంగా నిర్వహించాడు. ఒక 50 మంది అతిథులు ఈ వేడుకకు హాజయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తితో పాటు అక్కడికి వచ్చిన 50 మంది అతిథులపై కూడా కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ వేడుకలో ఉపయోగించిన కుర్చీలను, టేబుల్ వంటి వాటిని కూడా సీజ్ చేసినట్టు కంటోన్మెంట్ సర్కిల్ ఆఫీసర్ సుమిత్ శుక్లా తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version