జూన్ 10 వరకు లాక్ డౌన్… ఏంటి నిజమా…?

-

దేశంలో లాక్ డౌన్ దెబ్బకు ఇప్పుడు ప్రజలు బయటకు చెప్పలేని విధంగా కన్నీరు పెడుతున్నారు. లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే కేసులు బయటకు వెళ్తే వ్యాది సోకుతుంది. దీనితో ప్రజలు ఎవరూ వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు ఇవి ఏవీ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు, బ్రతికి ఉంటే చాలు అనుకునే పరిస్థితి. కాని వ్యాధి త్వరగా ఆగిపోతే మళ్ళీ దేశంలో వ్యాపారాలు పెరుగుతాయి మన బతుకులు బాగుంటాయి అని చిన్న చిన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు.

అయితే లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచార౦ సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. లాక్‌డౌన్ విషయంలో WHO ప్రొటోకాల్ ఉంటుందని.. దాన్ని అన్ని దేశాలు పాటించాలని WHO పేరిట ఓ మెసేజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. మార్చి 22న (జనతా కర్ఫ్యూ) ట్రయల్ లాక్‌డౌన్ జరిగిందని అంటున్నారు. ఇక అప్పటి నుంచి 5 రోజుల గ్యాప్ చొప్పున లాక్ డౌన్ ఉంటుంది అంటున్నారు.

మూడు దశల్లో లాక్‌డౌన్ ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. అలా జూన్ 10 వరకు లాక్ డౌన్ ఉంటుంది అంటున్నారు. అందుకే మన దేశంలో రిజర్వ్ బ్యాంకు, కేంద్రం లాక్ డౌన్ ని దృష్టిలో పెట్టుకుని… మూడు నెలల కార్యాచరణ ప్రకటించాయని అంటున్నారు. ఈ మెసేజ్‌పై WHO సౌత్ ఈస్ట్ ఏసియా విభాగం స్పందంచింది. అది ఫేక్ అని స్పష్టంగా చెప్పింది. అలాంటిది ఏమీ లేదని ఒక ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version