ప్రపంచ దేశాలన్నిటి వణికిస్తున్న కరోనా తో మొత్తం అతలాకుతలమైంది. చిన్న చిరు వ్యాపారుల నుండి పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్ని కుప్ప కూలిపోయాయి. ఆర్ధికంగా ఎన్ని వేల కోట్ల నష్టం వాటిల్లిందో ఎవరి ఊహకి అంచనాకి అందడం లేదు. అందులో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కి ఇది భారి దెబ్బ. అంతేకాదు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ. 2020 గ్రాండ్ ఇయర్ లో ఒక్కో హీరో వేసుకున్న ప్లాన్ అన్ని తారుమారు అయిపోయాయి. 2019 కంటే భారీ హిట్స్ ని తమ ఖాలలో వేసుకోవాలనుకున్న టాలీవుడ్ హీరోలందై ఆశలు ఆవిరైపోయాయి. ఇలా ప్లాన్స్ వేసుకున్న వాళ్ళలో స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా గత ఏడాది సక్సస్ లు అందుకోలేకపోవడంతో ఈ ఇయర్ కనీసం రెండు భారీ హిట్స్ ని నమోదు చేసుకుందామనుకున్న లెక్కలన్ని కరోనా వరస్ లో కొట్టుకుపోయాయి.
నాలుగేళ్ళుగా ఒక్క హిట్ లేని యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా భీష్మ తో సక్సస్ ని అందుకున్నాడు. తర్వాత రంగ్ దే సినిమాను రిలీజ్ చేయాకున్నాడు. కానీ షూటింగ్ స్టేజ్ లోనే అది ఆగిపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాల లెక్కలన్ని మారిపోయాయి. అంతేకాదు నేచిరల్ స్టార్ నాని, నిఖిల్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్.. ఇలా అందరి సినిమాలు ఆగిపోయాయి. వీటిలో ఎన్ని సినిమాలు ఈ సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయో కూడా అర్థం కాని పరిస్థితి.
పాపం మరో యంగ్ హీరో నిఖిల్ కూడా చాలా వాయిదాల తర్వాత అర్జున్ సురవరం తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తర్వాత కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాలను ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కంప్లీటవడం కూడా కష్టమని టాక్ వినిపిస్తుంది. ఇక కరోనా తో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమాను వంద రోజుల్లో పూర్తిచేసి పాన్ ఇండియా సినిమాగా భారీ వసూళ్ళని రాబట్టాలనుకున్నప్పటికి ఈ లెక్కలకి కూడా రెక్కలు తెగిపోయాయి.
ఇక రాం చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోయింది… నిర్మాతగా తీస్తున్న ఆచార్య ఆగిపోయింది. దాంతో చరన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ మొత్తం మారిపోయాయి. నెక్స్ట్ సినిమాలు కమిటయిన అవి సెట్స్ మీదకి ఎప్పుడొస్తాయో చరణ్ కే అర్థం కాని పరిస్థితి. ఇక ప్రభాస్, అల్లు అర్జున్ లు అనుకున్న ప్లాన్స్ కూడా కరోనా కాటు కి బలైపోయాయి. వీళ్లతో పాటు నందమూరి బాలకృష్ణ-బోయపాటి సినిమా, విక్టరీ వెంకటేశ్-నారప్ప, అక్కినేని నాగార్జున-వైల్డ్ డాగ్ సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఈ దెబ్బకి టాలీవుడ్ హీరోల ఆశలు లెక్కలన్ని 2020 లో మొత్తం మారి ఆవిరైపోయాయి.