ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లుకు లోక్ స‌భ ఆమోదం

-

ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లుకు లోక్ స‌భ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉద‌యం పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కాగానే… ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లు ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. అయితే.. ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లు ను ప్రవేశ పెట్ట‌గానే… విప‌క్షాలు చాలా గంద‌ర గోళాన్ని సృష్టించాయి. అయితే.. విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లు పై చ‌ర్చ కొన సాగింది. విప‌క్షాలు ఆధార్‌,.. ఓట‌ర్ అనుసంధానం.. బిల్లును తీవ్ర ంగా వ్యతిరేకించాయి. ఇది గోప్య‌త కు భంగం క‌లిగిస్తుంద‌న్నారు.

కాంగ్రెస్ ఎంపీ మ‌నీశ్ తివారీ… సుప్రీం కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా బిల్లు ఉంద‌ని ఫైర్ అయ్యారు. అటు ఎంఐఎం అస‌దుద్దీన్ ఓవైసీ… మాట్లాడుతూ… ఆధార్ రెసిడెన్స్ ప్రూఫ్ మాత్ర‌మేన‌ని.. సిటిజ‌న్ షిప్ ప్రూఫ్ కాద‌ని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ మాట్లాడుతూ… ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లు చాలా దారుణ‌మ‌ని ఫైర్ అయ్యారు. అయితే.. విప‌క్షాల వాద‌న‌ను అస‌లు ప‌ట్టించుకోని.. కేంద్ర ప్ర‌భుత్వం… ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లును లోక్ స‌భ లో ఆమోదించుకుంది. భోగ‌స్ ఓట్ల‌ను తొల‌గించేందుకు మాత్ర‌మే.. ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అను సంధానం బిల్లు ను తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version