ఢిల్లీకి పొంచి ఉన్న ప్రమాదం… క్రమంగా విస్తరిస్తున్న థార్ ఎడారి.

-

ఉష్ణమండల ఎడారుల్లో ప్ర పంచంలోనే 9 వ స్థానంలో ఉన్న థార్ ఎడారి క్రమంగా విస్తరిస్తోంది. రానున్న రోజుల్లో దేశ రాజధానిపై కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సీటీ చేసిన ఓ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫానులు రాబోయే సంవత్సరాల్లో జాతీయ రాజధాని ప్రాంతం (NCR) వరకు ప్రయాణిస్తాయని అంచనా వేసింది. ఎడారి, మైదానాల మధ్య సహజమైన ఆకుపచ్చ గోడలా ఉండే ఆరావళి పర్వతాలు క్రమంగా క్షీణిస్తున్నాయని స్టడీలో వెల్లడైంది.

ఎడారీకరణను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ ప్రస్తుతం అభివ్రుద్ధి చెందలేదు. దీంతో ఆరావళి ప్రాంతాల ఉత్తర భాగం ప్రభావితం అవుతోందని తెలుస్తోంది. థార్ ఎడాది 50 కన్నా ఎక్కువ శాతం విస్తరించి ఉన్న బార్మర్, జైసల్మెర్, బికనీర్, జోధ్ పూర్ జిల్లాలపై దృష్టి సారించింది అధ్యయనం. ఈ అధ్యయంనంలో జోెధ్ పూర జిల్లాలో ఎడారీకరణ నెమ్మదిగా సాగుతున్నట్లు గుర్తించింది. మరోవైపు థార్ ఎడాది విస్తరణ పాలి, నాగౌర్, చురు, అజ్మెర్ జిల్లాల్లో వ్యాప్తి ఆపడానికి ఫారెస్ట్ అధికారులు చెట్లను నాటుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version