లోకేష్ కు ఇష్టంలేకపోయినా ఇబ్బంది పెడుతున్నారా?

-

తాజాగా టీడీపిలో ఒక వర్గం నుంచి వినిపిస్తోన్న మాట… లోకేష్ కు రాజకీయాలంటే ఏమాత్రం ఇష్టం లేదని… చంద్రబాబు అండ్ కో బలవంతం మీద ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని! ఇది చాలా మంది నందమూరి అభిమానులకు, నందమూరి వారి వల్ల టీడీపీకి అభిమానులు అయినవారికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కానీ… లోకేష్ అభిమానులకు, చంద్రబాబు అభిమానులకు మాత్ర కచ్చితంగా షాకింగ్ న్యూసే! ఈ విషయాలపై తాజా విశ్లేషణలు చెబుతున్న మాట ఇదే! ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ప్రవర్తన చూస్తున్న వారికి కూడా ఈ అనుమానం రావడం… ఇప్పటికే అనుమానం వచ్చిన వారికి వారి అనుమానం కంఫాం అనే నమ్మకం రావడం అత్యంత సహజం!

వివరాల్లోకి వెళ్తే… ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ రాజకీయ నాయకుడూ కోరుకునేది… రాష్టరంలో సమస్యలు వస్తే, వాటిపై ప్రజలతరుపున పోరాడుతూ పేరు తెచ్చుకుని, రాజకీయ మనుగడ కాపాడుకోవాలని! ఇదే క్రమంలో… ప్రతీ సమస్యలోనూ ముందుగా తానే రెస్పాండ్ అయ్యి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని! కానీ… లోకేష్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదనేది ఆయన అభిమానుల ఆవేదన! ఒకపక్క కరోనా.. మరో పక్క తాజాగా విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన! ఇలాంటి సమయాల్లో అసలు లోకేష్ లాంటి యువ ప్రతిపక్ష పార్టీ నాయ్కులు ఆగకూడదు… అందరికంటే ముందుగా సమస్య జరిగిచోట ఉండాలి… ప్రజల తరుపున తాను ఉన్నానని, ప్రజలకు – ప్రభుత్వానికి మద్య నిలబడతానని చెప్పుకోవాలి! కానీ… లోకేష్ అలాంటి పనులు సంగతి పక్కనపెట్టి, అలాంటి ఆలోచనలు కూడా చేయడం లేదు!

ఈ విషయంలో బాబు సైతం లోకేష్ పై ఎన్నొ సార్లు ఒత్తిడి తెచ్చారని టాక్! ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా లోకేష్ ప్రవర్తనలో ఇంకా పిల్ల చేష్టలు పోలేదని బాబే తెగ ఫీలయిపోతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు! దీంతో ఓవరాల్ గా లోకేష్ అసమర్థుడు, అతని చేతిలో పార్టీని పెట్టడం ఆత్మహత్యా సదృశం అని టీడీపీ శ్రేణులతో పాటుగా బాబు కూడా గట్టిగా నమ్మేశారని చెబుతున్నారు!

ఇక లాస్ట్ ఆప్షన్ గా… కొవిడ్-టీమ్ ఒకటి ఏర్పాటు చేసి, లోకేష్ పర్యవేక్షణలో ఊరూరా సహాయక చర్యలు చేపట్టి, సొంత మీడియాతో దాన్ని హైలెట్ చేయించడానికి, తద్వారా లోకేష్ ను భవిష్యత్ నేతగా చూపించడానికి బాబు టీమ్ ఒక భారీ ప్రణాళికే రచించిందట. ఇలాంటి అవకాశం వస్తే ఏ యువ నాయ్కుడు మాత్రం ఊరుకుంటాడు? కానీ… లోకేషే మాత్రం ఎందుకో వెనక్కి తగ్గారని అంటున్నారు. దీంతో లోకేష్ కి రాజకీయాల మీద ఆసక్తి లేనట్టు, అందుకే ఆయన పూర్తిస్థాయిలో జనాల్లోకి రాలేకపోతున్నట్టు పార్టీవర్గాలంటున్నాయి!! ఇదే నిజమైతే గనుక… నారావారి చేతుల్లో నుంచి టీడీపీ చేజారిపోవడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టకపోవచ్చనేది విశ్లెషకుల మాటగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version