నారా లోకేష్ ఐఫోన్ హ్యాక్..!

-

ఒకపక్క ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్ర రాజకీయాలని ఊపేస్తోంది ఇప్పటికే ఆ కేసులో అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల వెళ్లే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ హ్యాకింగ్ కి గురైన విషయం కలకలం రేపుతోంది. ఇప్పటికి ఆపిల్ సంస్థ కూడా ఫోన్ కి సెక్యూరిటీ అలర్ట్ తో పాటుగా ఈమెయిల్ కూడా పంపింది హ్యాండ్ సెట్ టాపింగ్ హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ ని అలెర్ట్ చేసింది.

ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలకి పాల్పడుతోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ లని హ్యాక్ టాపింగ్ చేసి ఎలా అయినా విజయం సాధించాలని దుర్బుద్ధితో ఫ్యాన్ పార్టీ ఇటువంటి సిగ్గుమాలిన పనులకి ఒడిగట్టి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ హ్యాక్ అయిందా టాపింగ్ చేశారా అన్న విషయం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో హార్ట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version