ప్రభాస్ తో తీసే సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ : తమిళ స్టార్ డైరెక్టర్

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా తాజాగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దర్శకుడు మాట్లాడుతూ నేను ప్రస్తుతం విజయ్ తో లియో సినిమా చేస్తున్నానని… ఇప్పటికే విక్రమ్ లాంటి హిట్ సాధించడంతో నాపై అంచనాలు భారీగా పెరిగాయి..వాటిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ మాటల మధ్యలోనే త్వరలోనే ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, త్వరలోనే స్క్రిప్ట్ ను రెడీ చేస్తానని… ఈ సినిమా ప్రభాస్ మరియు నా కెరీర్ లో బిగ్గెస్ట్ అవుతుందని చెప్పాడు.

కాగా ఈ మధ్యన ప్రభాస్ నుండి వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్ మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుని థియేటర్ లలో రన్ అవుతోంది. మరి చివరగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version