కౌశిక్ రెడ్డికి దెబ్బ.. కేసీఆర్ సీరియస్.. సీటు గోవిందా.?

-

తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ వివాదాల్లో ఉండే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి ఒక కులాన్ని దారుణంగా తిట్టి చిక్కుల్లో పడ్డారు. చివరికి ఆయన సీటు పోయే పరిస్తితి వరకు వచ్చింది. కాంగ్రెస్ లో ఉండగానే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. సీటు దక్కలేదు..కానీ ఈయన వల్ల బి‌ఆర్‌ఎస్‌కు ఒరిగింది ఏమి లేదు. హుజూరాబాద్ లో పార్టీకి ఓటమే వచ్చింది.

ఆ తర్వాత ఎలాగోలా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈ క్రమంలో దూకుడుగా వెళుతూ.. ఎప్పుడు ఈటల రాజేందర్‌ని తిడుతూ వస్తున్నారు. అలాగే ఆ మధ్య గవర్నర్‌ని దారుణ పదజాలంతో కించపర్చి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా కమిషన్ నోటీసులు అందుకుని.. చివరికి క్షమాపణలు చెప్పారు. ఈ మధ్య రైతు దినోత్సవం రోజు.. ఓ రైతుని దుర్భాషలు ఆడారు. తాజాగా దశాబ్ది తెలంగాణ వేడుకల్లో సంక్షేమ పథకాలు అందడం లేదని ఓ మహిళా.. కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సమయంలో ఓ యూ ట్యూబ్ చానల్ కెమెరామెన్ అజయ్ అనే అతను.. రికార్డ్ చేసే ప్రయత్నం చేయగా.. అతనిపై కౌశిక్ రెడ్డి అనుచరులు దాడి చేసి.. రాయలేని విధంగా బూతులు తిట్టారు..ముదిరా జ్‌ కులానికి చెందిన అజయ్‌ని..ఆ కులం పేరుతో దూషించారు.

దీంతో రాష్ట్రంలో ముదిరాజ్ వర్గం.. కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడుతుంది.. ఎక్కడకక్కడ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని, రాజకీయంగా కౌశిక్ రెడ్డికి సమాధి కడతామని, ఎమ్మెల్సీ పదవి పై వేటు వేయాలని డిమాండ్ చెస్తున్నారు.

ఇక వివాదాల నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ అధిష్టానం కౌశిక్ పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా మద్ధతు పెంచుకోకుండా.. ఇలా వివాదాలతో ప్రజలకు దూరమవుతున్న కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ సీటు ఇచ్చే విషయంలో ఆలోచన లో పడ్డ‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆయన్ని ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి.. మళ్ళీ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు హుజూరాబాద్ సీటు ఇచ్చే దిశగా బి‌ఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్వరలోనే హుజూరాబాద్ లో మార్పు జరుగుతుందని తెలుస్తుంది. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ మొద‌టినుండి తెలంగాణ ఉద్య‌మంలో చురుకుగా ఉండేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version