నంద్యాల ఘటనపై నారా లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో పిల్లలందరికీ మేనమామనవుతానని.. సిఎం జగన్ కంస మామ అయ్యారని ఎద్దేవా చేశారు నారా లోకేష్. పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంతో మేనల్లుళ్లు, మేనకోడళ్ల ప్రాణాలు తీయడానికీ వెనుకాడటంలేదు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రాథమిక పాఠశాలలో ఏ ఒక్కరికి ప్రాణహాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరిచారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనాల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని… సమాచారం తెలిసి పిల్లల్ని పరామర్శించేందుకు వెళ్లిన మా టిడిపి నాయకుల్ని అడ్డుకోవడం… ఈ సంఘటనని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అర్థమవుతోందని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడంపై పెట్టిన దృష్టి, పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టడంపై పెడితే ఈ దురవస్థ ఉండేది కాదు కదా జగన్‌రెడ్డి గారు అంటూ నిప్పులు చెరిగారు.
సారా మరణాలన్నీ జగన్ సర్కారు హత్యలేనని.. సొంత మద్యం అధిక ధరలకి అమ్ముతున్నారు. జగన్ మద్యం కొనలేక సారా తాగి 15 మంది బలి అయ్యారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు లోకేష్. ఎక్సైజ్, ఎస్ఈబీ, జగన్ అధికార యంత్రాంగం ఏం చేస్తోంది?మరణాలపై ప్రభుత్వం, సంబధిత శాఖ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపణలు చేశారు.