ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధ రాత్రి చోటు చేసుకుంది. చివ్వెంల మండలం వస్రా తండాకు చెందిన బానోత్ బాలు అలియాస్ (బాలకృష్ణ) (28) సూర్యాపేట నుండి బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా సూర్యాపేట లోని ఎఫ్సీఐ గోడౌన్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.