పాపాలు చేయ‌డంలో పెద్దిరెడ్డి.. శిశుపాలుడిని మించిపోయారు – నారా లోకేష్‌

-

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాలు చేయ‌డంలో శిశుపాలుడిని మించిపోయారు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అని.. ఎర్ర‌చంద‌నం ర‌వాణాలో మంత్రి పెద్దిరెడ్డి న‌యా వీర‌ప్ప‌న్‌గా పేరు గాంచారని మండిపడ్డారు. పుంగ‌నూరు డాన్ మంత్రి అయ్యాక‌ వైన్‌, మైన్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాల‌కి కింగ్‌పిన్ అయ్యారని. .పాడిరైతుల పాలిట‌ పా`పాల‌` భైర‌వుడ‌య్యాడని మండిపడ్డారు.

అన్ని డెయిరీలు, స‌హ‌కార‌ సంఘాల కంటే లీట‌ర్ పాల‌కి అతి త‌క్కువ ధ‌ర ఇస్తోంది పెద్దిరెడ్డి సొంత‌ శివ‌శ‌క్తి డెయిరీ అని.. ధ‌ర ఎక్కువ ఇచ్చే డెయిరీలు పాలసేక‌ర‌ణ‌కి వ‌స్తే వారిపై గూండాయిజం చేస్తోంది పెద్దిరెడ్డి గ్యాంగ్‌ అని నిప్పులు చెరిగారు. ఇదేంట‌ని నిల‌దీసిన రైతుల్ని భ‌య‌పెట్టి, బెదిరిస్తున్నారని.. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ల గ్రామ పాడి రైతులు శ్రీజ డెయిరీకి పాలు పోస్తుండేవారన్నారు.

పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ మేనేజ‌ర్ పురుషోత్తం రెడ్డి పాల సేక‌ర‌ణ చేస్తే అంతుచూస్తామంటూ శ్రీజ డెయిరీ వారిని బెదిరించ‌డం పెద్దిరెడ్డి మాఫియా కార్య‌క‌లాపాల‌కు ప‌రాకాష్ట‌ అని నిప్పులు చెరిగారు. దీంతో పాల సేక‌ర‌ణ‌ని శ్రీజ డెయిరీ నిలిపేయ‌డంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారని.. తాము పాలు పార‌బోస్తాం కానీ, పాపాల భైర‌వుడు పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోయ‌బోమంటోన్న రైతుల్ని ఏం చేస్తావు పాపాల భైర‌వా పెద్దిరెడ్డీ అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version