ఆస్తి కోసం ఫ్రెండ్ భార్య కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత..ఆపై బలవంతంగా..ఎక్కడంటే?

-

ఆస్తి కోసం ఫ్రెండ్ భార్యను కాంగ్రెస్ నేత కిడ్నాప్ చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది.షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్,తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, గతేడాది శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి చెందగా.. అతని పేరెంట్స్ కోడలు రాధికకు ఒక ఎకరం భూమి ఇచ్చారు.దీనిపై కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది.

తన ఫ్రెండ్ భార్య రాధికకు తరచూ ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు చెబుతానని మహేందర్ నమ్మ బలికాడు. వివరాల కోసం వచ్చిన రాధికను ఈ నెల 20న తన కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. తిరుపతికి తీసుకెళ్తూ మధ్యలో మహేందర్‌తో పాటు అతడి డ్రైవర్ శేఖర్ కత్తితో బెదిరించి రాధిక చేతికి ఉన్న ఉంగరంతో పాటు,కొంత నగదు తీసుకొని ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు. రాధిక ఈనెల 20 నుంచి కనిపించడం లేదని శ్రీకాంత్ తల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా..ఈనెల 22న రాధిక తప్పించుకొని కొత్తూరు పీఎస్‌కు చేరుకుంది. మహేందర్ తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేందర్,డ్రైవర్ శేఖర్‌ను అరెస్ట్ చేశారు.నిందితులు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version