కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం

-

అలకనంద కిడ్నీ రాకెట్ లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అలకనంద కిడ్నీ రాకెట్ లో విచారణ వేగవంతం అయింది. ఈ కేసు ను సీఐడీ కి బదిలీ చేసే యోచన లో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో చర్చించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక బృందాలు.

Investigation in Alaknanda kidney racket accelerated

ఈ కేసులో 8 మంది బ్రోకర్లు ను అరెస్ట్ చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. కిడ్నీ దాతలు తమిళనాడు కి చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆరు నెలలు గా అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్ కు 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు విచారణ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version