నిజం చెబితే.. జగన్‌ తల 1000 ముక్కలే : నారా లోకేష్‌

-

నిజం చెబితే.. జగన్‌ తల 1000 ముక్కలే అంటూ సంచలన ట్వీట్‌ చేశారు టీడీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా సీఎం జగన్‌… గారు? అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు! అంటూ ఎద్దేవా చేశారు.

ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి.దీనికి ఏం సమాధానం చెపుతారు ? అని ప్రశ్నించారు నారా లోకేష్‌.

ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయని… నిప్పులు చెరిగారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదని నారా లోకేష్‌ మండి పడ్డారు. వైసీపీ సర్కార్ కు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version