నిన్నటి వేళ మనలోకం న్యూస్ మీడియా ఏపీ రాజకీయాల్లోకి ఆప్ ఎంట్రీ జగన్ వ్యూహమేనా అని ట్విటర్ వేదికగా అడిగిన ప్రశ్నకు నెటిజన్లు స్పందించారు.యాభై శాతం మంది అవును అని అన్నారు. యాభై శాతం మంది కాదని తేల్చేశారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మన రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే గెలుపునకు సంబంధించిన అవకాశాలు ఎలా ఉంటాయి. అదేవిధంగా కేజ్రీ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందా తదితర సందేహాలకు సమాధానాలు వెతకాలి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదాయ పార్టీలకు భిన్నంగా ఉండే పార్టీ.అదేపనిగా ఎవ్వరినీ తిట్టిపోసే పార్టీ కాదు. ఏపీ మంత్రి కొడాలి నాని మాదిరిగా బూతులు మాట్లాడే నాయకులు అక్కడ లేరు. బాగా చదువుకున్నవారే ఆ పార్టీలో ఉన్నారు. శ్రీకాకుళం,విజయనగరం లాంటి మారుమూల జిల్లాలలో కూడా ఆప్ కు హవా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం!
ఆ పార్టీ వెనుక నడిచిన వారంతా చాలా ఉన్నత విద్యావంతులే కానీ కొడాలి నాని మాదిరి బూతులు తిట్టే వ్యక్తులయితే కాదు. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ కి సంబంధించి మంచి లక్షణాలు. ఒకవేళ బీజేపీని కాదని జనసేన పార్టీ ఆమ్ ఆద్మీతో కలిసి పనిచేసినా కూడా మంచి ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఉచిత పథకాలకు ఆమడ దూరంలో ఉండేందుకే ఇష్ట పడుతుంది.అడ్మిన్ బాగుంటంది. బాగా చదువుకున్న వారు నాయకులుగా ఉండడంతో సంయమనం పాటించేందుకు,ఆచితూచి స్పందించేందుకు అవకాశాలే ఎక్కువ.
ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని జగన్ ప్రోత్సహించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఎందుకంటే అందులో తప్పేం లేదు.గతంలో కూడా తెరవెనుక వ్యూహాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వైసీపీని ఎంతగానో సమర్థించింది. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎంతగానో సహకరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కనుక ప్రభుత్వ ఏర్పాటులో ఆప్ సహకారం తీసుకున్నా మంచిదే! లేదా తెరవెనుక ఆప్ ను ప్రోత్సహించి తరువాత కొన్ని ఎమ్మెల్సీ పదువులు ఇచ్చి వారిని మంత్రి వర్గంలో తీసుకున్నా కూడా మంచిదే! కనుక నిన్నటి వేళ నెటిజన్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఫాలో అయి ఉండాలి.అంటే అవకాశాలు అటు సగం ఇటు సగం కానీ తేల్చలేం అన్నది వారి భావన కావొచ్చు.
ఆంధ్రా రాజకీయాల్లోకి కేజ్రీ ! జగన్ వ్యూహమేనా !#arvindkejriwal #YSJaganmohanReddy #AndhraPolitics
— Manalokam (@manalokamsocial) March 19, 2022
– ట్విటర్ పోల్ – మనలోకం ప్రత్యేకం