కాలం మారుతుంది… ఫ్యాషన్ వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుంది… విదేశీ సంస్కృతి తో పాటు మన వాళ్ళు కొత్తగా అలవాటు పడినవి ఫ్యాషన్ ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా యువత స్టైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దుస్తులు, జ్యుయెలరీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది యువత… ఇక ఆన్లైన్ మార్కెట్ రావడంతో నగరాల్లో ఈ స్టైల్ కి సంబంధించిన వాటి వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త వస్తువులను విడుదల చేస్తున్నారు.
ఐటి ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ మార్కెట్ లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకునే మంచి వ్యాపారం నిరుద్యోగులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు పలువురు. ఆన్లైన్ ద్వారా, డైరెక్ట్ గా ఈ వ్యాపారం బాగుంటుంది అంటున్నారు. కస్ట్యూమ్ జువెలరీ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరని అంటూ ఉంటారు. చిన్న చిన్న వేడుకులకు, కాలేజీ ఫంక్షన్లకు వాటిని ఎక్కువ వినియోగిస్తారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి పాడేస్తూ ఉంటారు. దీని మీద దృష్టి పెడితే మంచి వ్యాపారం అవుతుందని, దశల వారీగా వృద్ధిలోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు.
ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. దేశంలో కాస్ట్యూమ్ జువెలరీ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి ఉంది కాబట్టి హోల్‌సెల్లర్ల నుంచి జువెలరీని కొనుగోలు చేసి, దాన్ని కస్టమర్లకు నేరుగా అమ్ముకోవడం, ఆన్లైన్ లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఫెస్బుక్ లో, ఇంస్టాగ్రామ్ లో దీనిని స్థానికంగా ప్రచారం చేసుకుంటే అక్కడ ఎక్కువగా ఉండే స్థానిక యువత దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారని తద్వారా వ్యాపారం మెరుగుపడుతుంది అంటున్నారు. ఇక నోటి ప్రచారం ద్వారా కూడా దీనిని ఎక్కువగా వృద్ధిలోకి తీసుకురావచ్చని సూచిస్తున్నారు. పరిచయాలు పెంచుకుంటే వ్యాపారం ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ వ్యాపారానికి సూట్ అవుతారని వారికి అయితే అవగాహన ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.