ఈ అదిరే ఆఫర్స్ తో సొంతింటి కల సాకారం చేసుకోండి..!

-

చాలా మంది సొంతిల్లుని నిర్మించుకోవాలని అనుకుంటారు. మీరు కూడా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? కానీ కుదరడం లేదా..? అయితే మీకు ఇదే మంచి సమయం. ఎందుకంటే హోమ్ లోన్స్ పై అదిరే ఆఫర్స్ ని ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనితో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికీ రైట్ ఇదే అని చెప్పచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI

ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. పండగ ఆఫర్ల కింద 6.70 శాతం ప్రారంభ వడ్డీ తో హోమ్ లోన్స్ అందించనున్నట్లు వెల్లడించింది. ఎంత తీసుకున్నా ప్రారంభం వడ్డీ అదే అని తెలిపింది. ఇది ఇలా ఉంటే ఇది వరకు అయితే రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇపుడు మాత్రం అలా కాదు.

తాజా ఆఫర్‌ కింద ఏ మొత్తానికైనా కనీస 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని స్టేట్ బ్యాంక్ చెప్పడం జరిగింది. 45 బేసిస్‌ పాయింట్లు తగ్గడం వల్ల 30 ఏళ్ల కాలానికి తీసుకునే రూ.75 లక్షల రుణంపై రూ.8 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని వడ్డీ ఆదా చెయ్యచ్చు. పైగా ప్రాసెసింగ్ ఫీజ్ లేదు. ఇప్పుడు వృత్తితో సంబంధం లేకుండా అందరికీ తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది స్టేట్ బ్యాంక్. అలానే వేరే బ్యాంకులో ఉన్న గృహ రుణాన్ని ఎస్‌బీఐకి మార్చుకునే వారికి కూడా 6.7% వడ్డీయే.

Read more RELATED
Recommended to you

Exit mobile version