మహిళలకి శుభవార్త.. ఉచితంగా ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్..!

-

ప్రతీ ఒక్కరి ఇంటికీ కూడా వంట గ్యాస్ అవసరం. వంట గ్యాస్ ని ఫ్రీగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పొందవచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రజలు ఉచిత LPG కనెక్షన్‌లను తీసుకున్నారు. అయితే మీరు కూడా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ ని పొందాలని అనుకుంటున్నారా..?

 

gas

అయితే APL, BPL, రేషన్ కార్డు కలిగిన వారు తప్పకుండ పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశంలోని APL, BPL, రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ ఉచితంగా LPG గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ని ఇస్తోంది. మీరు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌ను పొందాలనుకుంటే వెబ్ సైట్ ద్వారా అప్లై చెయ్యాలి. 18 సంవత్సరాల దాటి ఉన్న మహిళలు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..

దీని కోసం ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
నెక్స్ట్ అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు ఇండేన్, భారత్ పెట్రోలియం, HP గ్యాస్ కంపెనీలు కనపడతాయి.
ఇందులో నుండి ఒకటి ఎంచుకోండి.
ఇప్పుడు వివరాలను ఫిల్ చెయ్యండి.
డాక్యుమెంట్లు ధృవీకరించిన తర్వాత మీ పేరుపై LPG గ్యాస్ కనెక్షన్ జారీ చేస్తారు.
నెక్స్ట్ స్టేజి లో LPG కనెక్షన్‌తో పాటు ఉచితంగా మొదటి సిలిండర్‌ను రీఫిల్ చేసి ఇస్తారు.
ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.

ఈ పత్రాలు అవసరం:

KYC చేయడానికి అవసరమైన పత్రాలు కావాలి. అలానే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ కావాలి. BPL రేషన్ కార్డ్ లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్, అందులో మీరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు రుజువు ఉండాలి. అదే విధంగా బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ అవసరం. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version