తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. LRSకు ఈనెల 31 తుది గడువు

-

లే అవుట్ క్రమబద్ధీకరణ(LRS)కు వచ్చిన దరఖాస్తులను ఈనెల 31 నాటికి పూర్తిగా పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. మూడేళ్లలో అనేకసార్లు గడువు పొడిగించామని, ఇకపై ఆ అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. 10,735 LRS దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. వీటిని క్లియరెన్స్ చేస్తే రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ గత నెలలో ప్రారంభమైంది. ముందుగా అక్రమ లే ఔట్‌లో వెంచర్‌లోని ప్లాట్లకు స్క్రూటీని జరుగుతుండగా వాటికి 2020 సంవత్సరంలో ఉన్న మార్కెట్ వాల్యూను అధికారులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హెచ్‌ఎండిఏ అధికారులు గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న అక్ర మ వెంచర్‌ల క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. గతం లో రూ. 10 వేలు కట్టిన వెంచర్ యజమానులకు ఫోన్ లు చేసి దానికి సంబంధించిన మార్కెట్ వాల్యూను కట్టాలని అధికారులు సూచించారు. అందులో భాగంగా అక్రమ వెంచర్‌దారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను చెల్లిస్తుండగా వారికి త్వరలోనే హెచ్‌ఎండిఏ అధికారులు వారికి ప్రోసీడింగ్‌లను అందచేయనున్నారు. ఇప్పటివర కు 1420 లేఔట్లలో 43,250 ప్లాట్లకు అధికారులు క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. అక్రమ వెంచర్‌లు అయిపోయిన తరువాత మిగతా ప్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version