ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపింది.
లక్నో బౌలర్లను చితక్కొడుతూ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మాక్స్ వెల్ చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు. ఇక ఛేజింగ్ కు దిగిన లక్నో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్ 65 పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ 62 పరుగులు చేసి.. జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్ లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. చరిత్ర సృష్టించాడు పూరన్. దీంతో ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా పూరన్ చరిత్ర సృస్టించాడు. ఇక అంతకు ముందు.. కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. మొదటి స్థానంలో ఉన్నాడు.