ఐపీఎల్ బౌలర్ మెహ్సిన్ ఖాన్ గురించి తెలియని వారు ఉండరు. ఉత్తరప్రదేశ్ కి చెందిన మెహ్సిన్ ఖాన్ ప్రస్తుతం లక్నోకు ఆడుతున్నాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ తో టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపించి, టీం ఇండియా ఫ్యూచర్ బౌలింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠిలకు జట్టుకి ఎంపిక చేసిన, తుది జట్టులో ఆడించడానికి ఆసక్తి చూపించని టీమిండియా మేనేజ్మెంట్, మెహ్సిన్ ఖాన్ ని అస్సలు పట్టించుకోలేదు.
భారత సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కి గాయం కావడంతో అతని రీప్లేస్ చేసే ప్లేయర్లలో మెహ్సిన్ ఖాన్ కూడా వినిపించింది. అయితే షమీ కారణంగా మెహ్సిన్ ఖాన్ కీ మరోసారి నిరాశ ఎదురయింది. ఇంతకీ మెహ్సిన్ ఖాన్ ఏమయ్యాడు. ప్రస్తుతం మెహ్సిన్ ఖాన్, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతనికి చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. త్వరలోనే మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు మెహ్సిన్ ఖాన్. అయితే అతనికి గాయం ఎలా అయ్యిందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం తెలియలేదు.